కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: హైదరాబాద్‌లోని క్వారంటైన్ ఇళ్లకు జియో ట్యాగింగ్

కరోనా వైరస్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇన్ఫోసిస్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఉద్యోగం ఊడిపోయింది. బెంగళూరు కేంద్రంలో పనిచేసే టెక్కీ ముజీబ్‌ మహ్మద్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వైరస్‌ వ్యాప్తికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విషయం ఇన్ఫోసిస్‌ సంస్థకు తెలియజేశారు. కంపెనీ యాజమాన్యం కూడా వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ధ్రువీకరించి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ అయినవారు లేదా అనుమానిత లక్షణాలున్నవారి ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. వీరితోపాటు విదేశాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారి ఇళ్లను కూడా జియో ట్యాగింగ్‌‌ పరిధిలోకి తీసుకొస్తున్నారు. హోంశాఖ నుంచి అందిన వివరాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసులు, ఆరోగ్య శాఖల బృందాలు వారి ఇళ్లకు వెళ్తూ వివరాలను సేకరిస్తున్నాయి.