ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దుతుగా అమరావతిలో ఆందోళనలు నడుస్తున్న విషయం తెలిసిందే. రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఈరోజుకు ఆయా గ్రామాల ప్రజలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పండగల్ని వేడుకలని పక్కన పెట్టి దీక్షలు, ధర్నాల పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమరావతియే ఏపీకి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో అమరావతి ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో రాజధాని గ్రామాల్లో జగన్ సర్కార్ పెద్ద ఎత్తున పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీయే కావాలని పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి ఆందోళనల్ని నిర్వహిస్తుందని అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు పార్టీల నేతల మధ్య అనేక సందర్భాల్లో మాటల యుద్ధం సైతం కొనసాగింది. అయితే అమరావతిలో ఇప్పుడు కొందరు జగన్‌కు మద్దతుగా టెంట్లు వేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
అమరావతిలో చంద్రబాబుకు షాక్... జగన్‌కు మద్దతుగా టెంట్లు